పేజీలు

2, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

కవిస్వరం: నిర్మలారాణి తోట కవిత అమ్మ గురించి రాయని కవి బహుశా ఉండకపోవచ్చు. నాన్న గురించి రాసిన కవితలు కూడా ఉన్నాయి. అయితే, భౌతిక ప్రపంచంలోనే కాకుండా మానసిక ప్రపంచంలో కూడా సర్వనామంగా తండ్రి పీడితుడిగా గుర్తింపు పొందాడు. పురుషస్వామ్యాన్నికి ప్రతీకగా తండ్రి విగ్రహం రూపు దిద్దుకుంది. అవును నిజమే, పురుషాధిక్యాన్ని ఎదిరించాల్సిందే, నిరసించాల్సిందే. కానీ, తండ్రి భుజాల మీద ఎన్ని బరువులూ బాధ్యతలూ ఉన్నాయనే విషయాన్ని పట్టించుకున్నవారు తక్కువ. ఆ బరువును మోయడంలో అతను పడే యాతన చెప్పనలవి కానిది. పురుషుడు ఏడ్వకూడదు, కన్నీరు కార్చకూడదు. ఈ సమాజం పెట్టిన ఆంక్ష. ఆ ఆంక్ష అతన్ని కరుగుగట్టిన విగ్రహంగా తయారు చేసిందా, ఓదార్పునకు కూడా నోచుకోని వ్యధాభరితుడిని చేసిందా అనే ఆలోచించడానికి నిర్మలారాణి తోట రాసిన కవిత అవకాశం కల్పిస్తున్నది. ఒక మహిళ తండ్రి గురించి ఆర్ద్రమైన కవిత ఇది. తండ్రి పట్ల సానుభూతి, సానుకూలత కనబరిచే కవితాభివ్యక్తి ఇది. కవిత అతి సాధారణంగా కనిపిస్తున్నది. కానీ, అందులోని ఆర్ద్రమైన భావనలు మంచి కవితగా రూపుదిద్దాయి. పురుషుడికీ మనసు ఉంది, పురుషుడికీ ప్రేమ ఉంది అని తెలియజెప్పే కవిత. నాన్నలందరికీ ఆమె సమర్పించిన కవిత ఇది. "కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి/ ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి/ కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..!" అనే వాక్యాల సారాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అది అనుభవానికి అందుతుంది. ఇలాంటి కవితాత్మకమైన వాక్యాలు ఈ కవితలో చాలా ఉన్నాయి.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1khhqV2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి