పేజీలు

11, మే 2014, ఆదివారం

Vijay Gajam కవిత

.......అమ్మ..మ్మా........(విజయ్....21.01.2009 నుంచి 11-05-2014) నన్ను కనకపోయినా కంటికి రెప్పలా కాపాడావూ.. చనుబాలు ఇవ్వకపోయినా చక్కని సంస్కారం నేర్పావు.. మునిపంటి భాదను దిగమింగి మమతానురాగాలు పంచావు.. అస్థీ ఐశ్వర్యాలు ఇవ్వకపోయినా కష్టాలలో అధుకోవడం నేర్పావు.. నన్ను ఓ మొక్క నుంచి నలుగురికి ఉపయోగ పడే చెట్టుగా మార్చావు.. నా కష్టఫలం ఏ మాత్రం ఆశించకుండా వేల్లిపొయ్యావా.. నన్ను ఓంటరిని చెసి వేళ్లీ పోయావా అమ్మా.. నువ్వు వెల్లిపోయాక తెలిసొచ్చింది..నా కోసం నువ్వు ఎం కోల్పోయ్యావో.. ఇప్పటికీ నా చేతి మీద నువ్వు కొట్టిన దెబ్బ మచ్చ నూసినప్పుడల్లా అనిపిస్తుంది.. నా ఉన్నతికి నువ్వు ఎంత తాపత్రయ పడ్డావో.. నా ధైర్యం నువ్వు .. నా స్వాస నీ బిక్ష... కాని నేను నువ్వు అడిగిన చిన్న కోర్కే కూడా తీర్చేలేని వాడినయ్యాను.. నన్ను మన్నిస్థావు కధూ.. మళ్లీ నా ఇంట్లో పుడతావు కధా అమ్మ..మ్మా..

by Vijay Gajam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sgw1PM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి