పేజీలు

11, మే 2014, ఆదివారం

Jagadish Yamijala కవిత

అవీ ఇవీ .......................... రాయి రాయి ... నాకో ఉత్తరం రాయి నన్ను ప్రేమిస్తున్నానని కాదు నువ్వు మరెవరినీ ప్రేమించడం లేదు అనయినా రాయి --------------- అద్దంలో చూసాను చదివాను ఒక కవిత అది నీ ముఖారవిందం ------------------- ఎప్పుడో ఒక రోజు నిన్ను మరచిపోతాను ఆరోజు గాలి వీయదు ప్రేమ అదృశ్యమైపోతుంది ---------------------- నీ పెదవులు పలికేదాకా నేను అనుభూతి చెందలేదు నా పేరు అంత అందంగా ఉందని ------------------------ విజయమనేది పొందేందుకు.... ఓటమి అనేది నేర్చుకోవడానికి ------------------- ప్రేమకు కళ్ళు లేవనేది అబద్ధం నీ కళ్ళను చూసిన తర్వాతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను ----------------- తమిళ మూలం కవి వైరముత్తు అనుసృజన యామిజాల జగదీశ్ -------------------------------- 11.5.2015 ----------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaa3hq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి