పేజీలు

5, మే 2014, సోమవారం

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | liaison | మాట్లాడుకోవాలి ఒకసారి ,వీలుంటే కొన్ని మాటలల్లుకోవాలి తెగిపోయిన బంధాల దారాలు ,మధ్యలో ముడేస్తూ ముడి కి ముడి కి మధ్య మనసుని నెమ్మదిగా బంధిస్తూ భవిష్యత్తు కలల గాలి పటంని నెమ్మదిగా గాలి మళ్లించాలి నిజాల కాకరకాయలకు అపుడపుడు శరీరంలో షుగర్ బావులు తవ్వి తీసిన కోటెడ్ నవ్వులు అతికించాలి నచ్చినా నచ్చకపోయినా జోడించిన పదాల పరాక్రమంతో ఇనుప గౌనులు తోడుకున్న హృదయాలని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేయాలి కన్నీళ్ళకి కాలిపోతున్న రెప్పలని మాటల ఆర్ధత్ర తో తడిపి జో కొట్టాలి సానుభూతుల కౌగిళ్ళ సంకెళ్లు వేసి నంబ్నెస్ డ్రగ్ లో భద్రంగా దాచాలి చేతలు అవసరం లేని మాటలేగా వెన్నెలకి వెన్న పూసి మరి అందించుకోవాలి శరీరానికో , మనసుకో తెలిసిన ఆకలితప్ప నాలుకలు లేని నిస్సహాయత్వాన్ని ఇంకోమారు నిద్రపుచ్చాలి మరోమారు అరచేతులలో కనిపించని క్రొత్త లఖీర్ ల వేటకి కాగితాల పడవ వేసుకొని తయారవ్వాలి నిశీ !! 05/05/14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sbzEIz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి