పేజీలు

14, మే 2014, బుధవారం

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | అ "జ్ఞానం " | మగ వెన్నెల కురవదా? సూర్యుడు ఆడ కాకూడదా? మెత్తని నవ్వుల్లో నిక్కచ్చి ప్రశ్నలు వెన్నెల లో మృదుత్వపు చలి శరీరాన్ని తాకినప్పుడు ప్రియురాలి వొళ్ళో అనుభవించిన వెచ్చదనపు జ్ఞాపకాలు కదలని మేఘంలా కురిసీకురియని వర్షపు జల్లులా తగులుతుంటే మగవెన్నెల ఎలా కురుస్తుంది ? ప్రకృతి ఆడ కాకుండా ఎలా ఉంటుంది ? ప్రకృతి అసమానత్వాలు పదాల్లో కూడా దాచేస్తూ అంతే మెత్తని సమాధానాలు అందులోనూ సూర్యుడు తన శక్తి ని ప్రకృతికాంత అందించి కొత్త జీవం తయారు చేసే శక్తిభాండాగారం కదా అందుకే సూర్యుడు పురుష్ గా ప్రయాస పడుతున్నాడు దాచుకొంటున్న గర్వపుకొంటె నవ్వుల స్వరం.. ఇంకోసారి ** గాయాలకి కారణాలు అన్నిసార్లు మారణాయుధాలు కాదేమో ? ** మరయితే ప్రతిసారి పురుషుడు అందించే శక్తి పసిబిడ్డలై జీవం పోసుకుంటుంటే స్త్రీ ఆశక్తిగా ,జీవచ్చవం గా ఎందుకు మారిపోతుందో “ఆడ” నుండి వినిపిస్తున్న మృదుస్వరం లో గాయపడ్డ ఏహ్యాత వెనక భేదాలన్ని శారీరకమే అయితే ఆలోచనల్లో ఇన్ని ఆసమానత్వాలు ఎందుకో ఎప్పటికి అర్ధం కాని కన్ఫ్యుజన్ ** నిజమే మనసులు మాట్లాడుకోకుండా పెదవులు మాటలు ఆడుకున్నపుడల్లా గాయాలకి కారణాలు మారణాయుధాలు కానక్కర్లేదు . ** ఎడారి ఇసుకల్లో దాగున్న సున్నితపు తడి మేఘాల్లోంచి జారిపడే రాళ్ళ వర్షాలు మృదువుగా మంచు కాల్చే గాయాలు అన్నిటిలో దాగున్న మసకనీడలా నిజం మిగిలింది అంతా నమ్మకాలంత అసత్యం ** నువ్వు నేను సత్యం As long as you treat yourself as first and best amongst equals నీకు నాకు మధ్య కనిపించని పరదాలు కూడా అంతే సత్యం . ** నిశీ !! 14/05/14 ***** అర్ధం కాని ఇష్యూస్ లో చేతులు పెట్టి అయ్యవారిని చేయబోతే కోతి అవుతుంది అన్నది కూడా అంతే సత్యం :)

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmFGjZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి