పేజీలు

3, మే 2014, శనివారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట-7 ________________ఆర్క్యూబ్ అది దొంగకు లొంగని డెంటయిన్ మూలం మెత్తని కరవాలం పెయ్యికి వెన్నుదన్ను ఎనామిల్ గన్ను పట్టుకొని పాయువుదాకా కాపల పన్నే కిరీట దారి పళ్ళే పెద్ద పటాలం ఊట తీర్థం ..స్వేత పద్మం వాక్ భువనం ..మేరున్నగం ఎగిలివారంగనే వేప పుల్లోపనిషత్ బట్టీయం ఇపుడిట్లా- దంతదావనం శ్రుతి తప్పి ఓర్చుకోలేని బాధ పురికెక్కుద్ది టైం చూసుకుని నోస్టాల్జియ అది -తీరికున్నప్పుడే ప్రత్యక్షమయ్యే మంత్రగత్తే గతాన్ని ముందు పెట్టి శబరి లెక్క కొసరి కొసరి ఫోజు గొడుతుంటది వద్దన్నా-లాలాజల ఓలలాటలో జ్ఞాపకాలు సొర్రేస్తయి గర్బస్తమైన పన్ను కేంద్రంగా బాల్యం విస్తరిస్తది రైకల నిండ పండిన పాలపండ్లే బోసినోట్లో చుక్క పొద్దై కథ నడుపుతై ఆ కథల్నే - దవడ ఎముకల్లో దేహ సౌందర్యం మొలకేత్తి పాల పన్నైతది పైన కిరీటం లోన వేళ్ళు అవి నరాలు రక్త నళాలు నది రక్తం పేఠభూమి మాంసం ఎలపట దాపట జీవన్మరణం సాగవుతున్న భూగోళం మనిషి నడిచే పళ్ళతోట ఆ తోటే దేహపు కుల గోత్రం శాశ్వత మురిపాల వంశవౄక్షం * (ఇంకా వుంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ne6hmM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి