పేజీలు

21, ఏప్రిల్ 2014, సోమవారం

John Hyde Kanumuri కవిత

ఎవరైనా ఎందుకు వస్తారు *** పిలిచినంతనే తమ పనులు మానుకుని ఎగురుకుంటూ వస్తారంటావా! ఎప్పుడో ముడిపడిన బంధాన్ని జ్ఞాపకంచేసి కొన్ని క్షణాలు గతంనుంచి వర్తమానానికి వంతెనె కట్టాలని ఎదురుచూస్తుంటావు రాలిపోయిన శిశిరాకులను కుప్పలుచేసి కాల్చాలనుకున్నప్పుడు నీ జ్ఞాపకాలు రేగే పొగలా అన్పిస్తే ఎవరైనా ఎందుకు వస్తారంటావు ! నీవు పంచాలనుకునే గంపలగంపల పళ్ళు రుచీ పచీ లేనివని అనుకుంటుంటే ఎవరైనా ఎందుకు వస్తారంటావు ! నీవు ఎదురుచూస్తున్న సమయానికి నేనెంత బిజీయో నీకు తెలియదు పలకరింపుల స్పర్శాహస్తంకోసం నువ్వు ఎదురు చూస్తుంటావు నీవులేనప్పుడు నలుగురూ చేరితే వారిమధ్య సంతోషాన్నో, దుఃఖాన్నో కొంచెం పులుముకొని వస్తారు కొంచెం గుప్పెటను విధిలించడానికి నీ స్వరాన్ని విప్పి అందరికీ ఎవో జీవన సంగీత సంగతులు విన్పించాలనుకుంటావు నువ్వలా పాడుతుంటే నీకు తెలిసినదెంతో ఉంటుంది అయినా ఎవరికి తెలిసిన కొలతల్తోనే నిన్ను చూడాలనుకుంటారు అన్నవచ్చాడని తమ్ముడూ గురువు వచ్చాడని శిష్యుడు అలావచ్చి మొహం చూపించిలోగా సెల్లుఫోనులోంచి ఎవ్వరో వాలుతారు నీకో నవ్వుముఖం పాడేసి మాట్లాడుతూ మాట్లాడుతూ చల్లగా జారుకుంటారు నీనుంచి నేర్చుకోవడం మానేసి నీవే మారాలంటూ సలహాలిచ్చిపోతారు ఎన్నో ఏళ్ళుగా చూసున్న అదే అరుగును బాధలను, కన్నీళ్ళను పదే పదే ఊడుస్తూ ఒంటరిగానే పాడుకుంటావు. వినడానికి ఎవరైనా ఎందుకు వస్తారు ......................21.4.2014....7:00 ఉదయం

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qyi3N1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి