పేజీలు

30, ఏప్రిల్ 2014, బుధవారం

Chi Chi కవిత

_CommoditY_ మానమర్యాదలంటే అబ్బో అనుకున్నామనిషన్న తేడాలో అమ్ముడయ్యేలా ఉంటే వెంట్రుకయిపోయే ముందుచూపు మదుపనుకోలా.. మనిషనుకునే విలువనంతా కాజేసిన డబ్బునే మనిషనుకుంటే పోలా!! బాగుంది..డబ్బాగుంది డబ్బు మనిషయ్యాక , మనిషేమవుతాడు?? తెలీదు!! డబ్బుకీ తెలీదు..మనిషికీ తెలీదు డబ్బైన మనిషికీ తెలీదు..మనిషైన డబ్బుకీ తెలీదు ఇంకేం తెలుసు నా గబ్బులోది ఇంతే తెలుసు!! ఆపాదమస్తకం ఓ ప్రశ్నగా దిగే ఈ జన్మకి సంతలో సరుకైపోవడమే సమాధానం!! బాగుంది కదా అమ్మడం అంటే డబ్బుని కొనుక్కోడమే కొనడం అంటే డబ్బుని అమ్మేయటమే మధ్యలో ఏదుంటే ఏంటి మనిషీ డబ్బు ఒకటయ్యాక!! అవసరమిలా చేయిస్తోంది అవమానించినా పర్లా డబ్బుతోనే తుడిచేస్కుంటారు డబ్బులూ..మనుషులూ అంతలా అరిగిపోయారు మరి ఒకరిలో ఒకరు..ఒకరై!! విలువ కట్టలేం జన్మకి..విలువుంటేగా విలువిచ్చుకో ఉన్నంతలో ఉన్నంతిచ్చుకో విలువిచ్చినంతలో ఇక్కడ సరుకంటే విలువే సరుకుని బట్టే విలువ కాబట్టి!! ఈ విధంగా డబ్బు మనిషైపోయింది..విలువ సరుకైపోయింది____ (30/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdrKr5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి