పేజీలు

9, ఏప్రిల్ 2014, బుధవారం

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు ||కళ్యాణం|| తాటాకు పందిర్లు.. ముతైదు సందడ్లు.. మామిడాకుల తోరణాలు.. అనుబంధాల పెళ్ళికి ఇవే అంకురార్పణలు.. కళ్యాణ వేడుకను కన్నులారా తిలకించుటకై విచ్చేయు బంధుజనాలు.. కన్నె పిల్లల కళకళలు.. కొంటె పిల్లల అల్లర్లు.. చంటి పిల్లల ఆట, పాటలు.. కళ్యాణ వేడుకకు కమనీయ సాక్షాలు.. ముత్యాల పందిరిలో, రత్నాల పీటలపై, వజ్రాల వధువును చూచి వెన్నెలే చిన్నబోయేనో..? మరో సీతమ్మ అని మూరిసిపోయేనో..? వరుడేమో రామయ్య తనకి సాటి వేరెవరు లేరయ్య తన మేనుసొగసుకు నెలరేడు కూడా నిలవలేడయ్య.. చూడచక్కని జంటని చూచి జామురాతిరి వెలుగును పంచేను తన్మయంతో జోల పాటను మరచేను.. బ్రహ్మలోక ప్రాప్తికోసం మామ చేసేను వరునకు దానం అదే "కన్యాదానం" తన వంశాభివృద్ధికై వరుడు గ్రహించేను "పాణిగ్రహణం" 'గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్తం మయావత్య జరదృష్టిర్య దాసహ' దాంపత్యము కలిసి మెలసి ఉండవలెనని తెలుపుటకు జీలకర్రబెల్లము.. ఇదియే శుభయోగము.. ఇదియే శుభముహుర్తము.. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా! కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్!! కొంటె చూపుల నడుమ కొంగు కొంగు కలిపి ఏడుజన్మల బంధం ఏడు అడుగులతో మొదలై ఏకతాటిగా నడపగా వేసేరు సప్తపది.. నిశ్చల మనస్సుకై దృవ దర్శనం.. ముతైదు తనానికై అరుంధతి వీక్షణం.. కన్నవారు ఒకవైపు.. కడదాకా తోడు నిలిచేవాడు మరోక వైపు.. నడిమధ్యన కళ్యాణ కన్యకకు కన్నులారా కారేను బాధానంధ భాష్పాలు.. ఇవీ ఎవరు వర్ణింపలేని దృశ్యాలు.. 09-04-2014 //మా అక్క పెళ్ళికి నేను ఇచ్చిన చిరు కవిత

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsn1GG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి