పేజీలు

26, మార్చి 2014, బుధవారం

Usha Rani K కవిత

మరువం ఉష | బ్రతుకాటలు --------------------------- అమ్మతో దోబూచులు, ఆపై దొంగాటలు, ఇంకెన్ని వినోదాలో, వింత వింతలుగా విరామం లేకుండా అపుడాడింది, ఇపుడు ఆడించబడుతుంది నేనే. ఆటలే బ్రతుకున కలిగిన ఆకళింపు, ఇకిప్పుడు అలుపెరుగని ఆటగత్తెను. ఎన్నెన్ని ఇసుకగూళ్ళు పొందిగ్గా తీర్చిదిద్దానో: అల్లుతున్న ఈ ఒక్క పొదరింట ఇంకేదో మిగిలేవుంది, గూడు పేర్చుకుంటూ ఆట కాని ఆట నడుస్తూనే వుంది. పేక మేడలు, పడినవెన్నో, పేర్చినవన్ని. అడియాసల పునాదుల సాటిగా నిత్యం ఆశల సౌధాల కట్టుబడి- ఇపుడూ వూహల్లో రధం ముగ్గు- పుష్పకమంత, పూలతేరుకెంత అందమే! రాణి నేనే, రారాజ్ఞి నేనే, సారధీ నేనే, సమాయత్తమూ నాదే. వినువీధుల విహరించినా, ఏ వూరు వాడల వెళ్ళివచ్చినా, ఆగని ఆ పయనాలే నా వాస్తవ వాహనానికి ఇంధనాలు. స్తంభాలాటలో ఓడిందెన్నడటా! విజేతననా, విధి చేత చిక్కాననా ఇంకా సాగుతుందది? కాలాతీతమైతే, కాలం కలిసిరాకపోతే నిట్టూర్పు వేదం. విధి అనుకూలిస్తే, ఘటన కలిసివస్తే ఆనంద సంభ్రమం. ముగింపు లేనివన్నీ, నిర్ణేతలే లేని నా బ్రతుకాటలు. 25/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gA3tjd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి