పేజీలు

22, మార్చి 2014, శనివారం

Pardhasaradhi Vutukuru కవిత

మన కుటుంబం లో పిల్లవాడు పని చేసుకు వస్తే బాగా చేసావు , ఇంకా కొద్దిగా చేస్తే బ్రంహాండం అంటే వాడు పొంగిపోయి మళ్ళీ చేసే సమయం లో ఇంకా బాగా చేస్తాడు , భర్త భార్యను బాగా కష్టపడుతున్నావు అంటే ,ఎంతటి కష్టాన్ని అయినా చిరునవ్వుతో ఎదుర్కొని చక్కటి ప్రశాంత జీవితం , సహకారం ఇస్తుంది , రంగాస్తల నటులు చప్పట్లు కొడితే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోయీ మనల్ని సంతోష పెట్టటానికి ఇంకా కృషి చేస్తారు , ఒక సంస్త యజమాని సిబ్బంది ని పిలిచి మీ వలన లాభం వచ్చింది అని అంటే ఉద్యోగులు తమ పని కి గుర్తింపు వచ్చినట్లుగా భావిస్తారు ,ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది , ఒక చిన్న ప్రోత్సాహం ఎన్ని విజయాలకు పునాది అవుతుందో , ప్రోత్సాహం అనేది ఒక గొప్ప శక్తి లా పనిచేస్తుంది . ఇక్కడ కవులకు కూడా మీ లైక్ వాళ్లకు ప్రోత్సాహం , దీనివలన నేను మనుషుల మధ్య వున్నాను అన్న భావన తో పాటు కొన్ని లక్షల మధ్య మనకు తెలియని వ్యక్తులు నా కవితను ఇష్టపడ్డారు అంటే , ఆ ఆనందం వర్ణనాతీతం , అది అనుభవిస్తే కాని తెలియదు . . ఒక ప్రోత్సాహం ఇవ్వటానికి మనకు ఎంతో గొప్ప మనసు వుంది తీరాలి , అది జన్మ సంస్కారం అయి ఉంటేనే మనకు వస్తుంది . ప్రోత్సాహానికి పెట్టుబడి లేదు కేవలం బాగుండాలి , ఇంకా బాగారాయాలి అనే గొప్ప మానసిక భావన . మన కుటుంబానికి అతిధి వస్తే పలకరిస్తాం , మన గ్రూప్ లో ఏదైనా కవిత రాసిన , మంచి వాక్యాలు రాసిన దానిని లైక్ చేయటం మన అందరి ధర్మం . ప్రోత్సాహం లో వున్నా ఆనందం మనం అందరం అనుభవిద్దాం . మనలా అందరు సంతోషం లో ఉండేలా ప్రోత్సహిద్దాం . హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరేహరే మహామంత్రం జపించండి ఆనందం గా జీవించండి మీ అడ్మిన్ కృష్ణా తరంగాలు పార్ధసారధి ఊటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inkStZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి