పేజీలు

3, మార్చి 2014, సోమవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//మిత్రమా...వ్యధాభొగీ// తటాకంలో కలువలెందుకు లేవు నదిలో ప్రవాహమెందుకు లేదు సముద్రంలో అలలెందుకు లేవు గాలిలో చల్లదనమెందుకు లేదు ఎండలో వేడిమెందుకు లేదు ఆఖరికి స్పర్శకి ఏ అనుభూతీ దక్కలేదు నీవన్న మాట అంతటిదే...కాదూ! మిమ్మలని నమ్మి అనుభవిస్తున్నాను మీకేం సుఖంగానే ఉన్నారు అన్నప్పుడు ఒక్క పదమూ వినిపించలేదు అంకెలు బండరాళ్ళుగా దొల్లిన శబ్ధం నువ్వు నిర్మించుకొంటున్న రహదారిలో పరుస్తున్న రాళ్లమీద రోడ్ రోలర్ నడుస్తున్న వైనం సమాధానం చెప్పడానికి నా దగ్గర అంకెలూ లేవు అక్షరాలూ లేవు ఆస్థిపాస్తులు చుసి వెనుక తిరిగి పర్సును బట్టి స్నేహం చేసి నువ్వు రాసుకొచ్చిన భూడిద కపాళానికి కప్పిన చర్మమని తెలియలేదు మాటనే ముళ్ళుగా మార్చగల నేర్పరీ అంకెలలోనే అభివృద్దిని చూసుకొనే వ్యాపారీ నేనొక అద్దాన్ని సరిగ్గా చూడు నేను నీలానే కనిపిస్తాను చేజార్చుకొన్నావో వేల వ్రక్కలౌతాను నిర్లక్షంగా నడిస్తే గాయమే నెత్తురోడుతాను ఓ మేధావీ నేనొక నిక్కసుఖభోగిని నాలో నిండిన కల్మషాన్ని నన్నంటిన దుమ్మూ దూళిని నాపై నెరిపే దాష్టీకాలని నా కళ్ల బడ్ద దుర్మార్గాలనీ సిరాతో కడిగే కార్మికుడిని చెమటలాంటి అమృతాన్ని అంతఃకలహ నిశి సంచారీ కళ్లలోకి చూసి మాట్లాడొకసారి నేను నిక్కసుఖభొగిని అంకెలు నిరాధారమని నిరూపించగల అక్షరాన్ని..నేను నీ మిత్రుడిని.....03.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSv4hW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి