పేజీలు

31, మార్చి 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో జరిగిన 'ఉగాది కవిసమ్మేళనం' లో నేను వినిపించిన కవిత : రెండు కోకిలలు! రచన: ‘కవి దిగ్గజ‘ డా. ఆచార్య ఫణీంద్ర జయము! జయము! జయము! ‘జయ‘ నామ సంవత్స రాంబికా! ఇదే జయమ్ము నీకు! సకల జయము లింక, సంతోషముల దెచ్చు జనని! ‘వత్సరాది’! స్వాగతమ్ము! విస్తరించి మావి వృక్షమ్ము పెద్దగా రెండు శాఖ లెదిగె నిండుగాను! ఒక్కటి ‘తెలగాణ‘, మొక్క ‘టాంధ్ర ప్రదేశ్‘ - తెలుగు మావి రుచులు ద్విగుణమయ్యె! ఉవ్వెత్తు నెగసిన ‘ఉద్యమ ‘ గ్రీష్మాల మండుటెండల లోన మాడినాము - విరుచుక పడుచును వీపులందు కురియు ‘లాఠి ‘ వర్షాల కల్లాడినాము - బందు, హర్తాళ్ళతో వణుకు శరత్తులన్ పలుమార్లు వడవడ వణికినాము - ఆకులట్లు యువకు లన్యాయముగ రాలు శిశిరాలనే గాంచి చితికినాము – తుదకు నిన్నినాళ్ళ కిపుడు పదియునాల్గు వత్సరముల బాధ లుడిగి, ఫలిత మబ్బి, నేటికి కదా విరియుచు నీ తోటి మాకు చివురులెత్తు వసంతమ్ము చేరుచుండె! భారీ తుఫాను లుడిగెను - నీ రాక ‘ఉగాది‘! మాకు! నిజము! ‘యుగాదే‘! వేరుపడె తెలుగుభ్రాతలు! వారికి, వీరికి శుభమిడు బ్రహ్మాండముగాన్! కార, ముప్పు, వగరు, కడు చేదు, పులుపులే కడచి, కడచి, తుదకు కలిగె తీపి! క్రొత్త వత్సరమున క్రొంగొత్త రుచులతో వండినా ‘ముగాది పచ్చ‘డిదిగొ! మెలగుచు స్నేహభావమున మెండుగ నొక్కరితో మరొక్కరున్ తెలుగు సహోదరుల్ పరమదివ్యముగా సహకారమందుచున్, వెలసెడి రెండు రాష్ట్రముల వేగముగా నభివృద్ధి జెందినన్ - తెలుగిక రెండు భాగముల తేజమునన్ ద్విగుణీకృతంబగున్! నిండుకుండ లట్లు రెండు రాష్ట్రాలలో పూర్తిగ నదులెల్ల పొంగి, పొరలి - దండిగా ప్రజలకు దాహార్తి తీర్చుచున్, పంటభూములకును ప్రాణమిడుత! యాదగిరి నారసింహుని యమిత భక్తి నరిగి, మ్రొక్కులనిడుత సీమాంధ్ర జనులు; సింహగిరి నారసింహుని చేరి, ఇంక మ్రొక్కులిడుత తెలంగాణ భూమి ప్రజలు! ఓ ‘జయాఖ్య వర్షమ’! కను డుత్సహించి - రెండు కోకిలల్ కూసె నీ పండుగ కిక! ఈవు ‘తెలగాణ‘, ‘సీమాంధ్ర‘ ఇరు గృహాల తిని ‘ఉగాది పచ్చడి‘, నిడు దీవెనలను! — &&& —

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hbqWBI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి