పేజీలు

6, ఫిబ్రవరి 2014, గురువారం

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! బోన్సాయ్ బాల్యం!!06-10-13!!05-02-14!! ******************* అందని ఆకాశం అంచుకి నిచ్చెనలువేసి ఆశల సౌధాలను నిర్మించాలనుకునే క్రమంలో మీ కలల బ్యాగులు వాళ్ళ శక్తికి మించిన బరువులై వీపున భారంగా వేలాడే పుస్తకాల సంచీలవుతాయి కాలాన్ని క్యాలెండర్ మీద తేదీలు,వారాలుగా కాక ' కాంపిటీషన్ ' దృష్టితో మాత్రమే చూసే మీ చూపులకు అందమైన బాల్యం పాలుకారే చెక్కిళ్ళ పసితనంలోనే అయిష్టంగా అమ్మఒడిని వీడిన బుడిబుడి అడుగులై ' కార్పోరేట్ బడిలొ మడత నలగని ' యూనిఫాం ' లవుతాయి మీ భవిష్యత్ ఊహల్లో ఇంజనీర్లు,డాక్టర్లయినవాళ్ళు అమెరికా డాలర్ల పంట పండించే వృక్షాలయ్యేందుకు వేల డొనేషన్లు వసూలు చేసే ఖరీదైన స్కూళ్ళ నేలలో పెట్టుబడి విత్తనాలుగా నాటబడి తరగతి గదుల్లో సత్తువ లేని మొక్కలుగా అంకురించి తలలు వాల్చేస్తాయి పిండారబోసిన వెండివెన్నెల వెలుగుల్లో గోరుముద్దలు తింటూ నానమ్మ,తాతయ్యలుచెప్పే జానపద కథలను వింటూ ఆదమరిచి నిద్రించి కలల అలల్లో తేలియాడాల్సిన వాళ్ళను నాలుగు గోడలమధ్య క్లాస్ రూం బందిఖానాలో ఖైదుల్నిచేస్తాయి అభిమానంగా ఎత్తుకోవడాలు,ఆప్యాయంగా హత్తుకోవడాల్ని పలవరించే పసి హృదయాల కలల్ని కల్లలుచేస్తూ ర్యాంకులు తగ్గిపోతాయన్న హడావుడితో మీరుచేసే ఆరాటం ఏటినీటిలో స్వేచ్చగా తిరుగాడే చేపపిల్లలను గాజుపలకల మధ్య అందమైన అక్వేరియంలో బంధించి ఆహారంగా కృత్తిమ ఆక్సిజన్ అందించేట్లుచేస్తుంది పగలంతా పుస్తకాలపురుగులై అలసినవాళ్ళను ' హోంవర్క్ ' భూతం అర్ద్రరాత్రిదాకా వెన్నాడి ఆవులింతలకు సైతం దూరం చేస్తుంది పొరపాటున ప్రోగ్రెస్ కార్డ్ లో తగ్గిన మార్కులు మీ కళ్ళలో ఎరుపుజీరలై వాళ్ళపాలిట హుంకరింపులవుతాయి ఆట బొమ్మలతో ఆడుకోవాల్సిన వాళ్ళ లేబ్రాయపు చేతివేళ్ళు ' శిక్షణ ' పేరుతో పేముబెత్తం దెబ్బలతో బొబ్బలెక్కుతాయి వెన్నుసైతం ఒంగొపోతున్నా తప్పని టన్నులకొద్దీ పుస్తకాల మోతతో ఆరేడేళ్ళ పసివయస్సులోనే మూరెడు పొడవు పెన్సిళ్ళను చేతబట్టిన బాల్యం ఇస్త్రీ మడతనలగని ' నెక్ టై ' ల సాక్షిగా కుస్తీకి సిద్దమవుతోంది ' కంప్యూటర్ పై కళ్ళు '-' అమెరికావైపు కాళ్ళు ' గా సాగే మీ ధోరణి వాళ్ళను చిలుక పలుకులకు దూరం చేస్తోంది పలకా,బలపాలతో జతకట్టిన పసితనం తమకళ్ళను నల్లబల్లకు అతికించుకొని ఆప్యాయతకు దూరం అవుతోంది మమతల ఎరువుతో ఆప్యాయతల పాదుల్లో ఏపుగా పెరిగి కాపుకాయాల్సిన మెదళ్ళను మొదలంటా నరికివేసి పరచిన పచ్చనోట్ల తివాచీలపై మీరు పెంచే మరుగుజ్జు (బోన్సాయ్)వామన వృక్షాలు ఉగ్గుపాల దశలోనే బొగ్గుపులుసు వాయువుల్ని శ్వాశిస్తూ అందరికీ ఫలితమివ్వని కుండీ మొక్కలుగానే పెరుగుతాయి అందుకే అమ్మా నాన్నలూ ..... వాళ్ళను చదువు ' కొనే ' వాళ్ళుగా కాక ఎన్నటికీ మరచిపోలేని సుమధుర అనుభూతుల్ని మిగిల్చే బాల్యం అనుభవాల్ని మళ్ళీ,మళ్ళీ జీవితాంతం చదువుకునేవాళ్ళుగా ఎదగనీయండి ప్లీజ్........* (అంద్రజ్యొతి నవ్య వీక్ల్య్ 24-05-2006) (కవితావార్షిక-2006, మట్టి వాసన కవితా సంపుటి లో పునర్ముద్రితం) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167* (నేను స్వప్నించే లోకంలో జీవించే వారి కోసం)

by Vempalli Reddinagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nT6TPt

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి