పేజీలు

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Srivalli Radhika T కవిత

శిక్షణ//టి. శ్రీవల్లీ రాధిక అన్నీ వున్న ఐశ్వర్యవంతుడే అయినా అపుడపుడూ నాకేమిస్తావంటూ కొంటెగా అడుగుతాడు నావి అనుకున్నవాటన్నిటినీ మరెవరికో పంచేసి నన్నేడిపించాలని చూస్తాడు నేనెవరికీ యివ్వనంటూ దేన్నైనా గట్టిగా పట్టుకుంటే నా గుప్పెటలోనుంచి దానిని సున్నితంగా తప్పిస్తాడు ఉక్రోషంతో నేను వాదనకు దిగితే నేనిచ్చిందేకదా తల్లీ అంటూ నాన్నలా నవ్వుతాడు ప్రలోభాలనే బండరాళ్ళను తెలియక మెడకి కట్టుకున్న ప్రతిసారీ పరీక్షల ప్రవాహానికి కట్టలు తీస్తాడు తెలివితెచ్చుకుని నేనా బరువులొదిలించుకునేవరకూ నిర్లిప్తంగా నను గమనిస్తాడు మరొకప్పుడు… నేనూహించని పురస్కారాలని పూలదండలా నా మెడలో వేస్తాడు నేను దానిని తడిమి మురిసే లోపూ ఆ పూరేకులన్నీ నాపైనే రాల్చేసి వాటి వెనుకనున్న సూత్రాన్ని గమనించమంటాడు నిష్కామమనే నావని తయారుచేసుకునేవరకూ నన్నో కంట కనిపెడుతూనే ఉంటాడు ఒక్కసారి దానినధిరోహించి నిర్భయంగా కూర్చున్నానంటే ఇక వేల వరాలు నాపై కురిపిస్తాడు ***

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klzcmX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి