పేజీలు

15, ఫిబ్రవరి 2014, శనివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని// నోట్లు నిండి నీతులు చెప్పిన జేబు నేనే ప్రశ్ననెదుర్కోలేక పారిపోయిన జవాబు నేనే మనిషికంటే చెడ్డది డబ్బు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. సమైకాంద్రని రాష్ట్రపతి పరిశీలిస్తానన్నారన్న నేత నేనే 60ఏండ్ల ఉద్యమానికి రాష్ట్రపతి సానుకూలమన్న నేత నేనే ఇరుపక్షాలకీ మిగిలే చీడ రాజకీయం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని......06.02.2014. కూటికోసం నీడకోసం కట్టుకున్న చీమలపుట్ట నేనే ధౌర్జన్యంగా ఆక్రమించుకొన్న విషపునాగు నేనే బలవంతుడే గెలుస్తాడన్న పకృతి నియమం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ వంద గొడ్లు తిన్న రాబందు నేనే గాలి వానకు చచ్చిన ఆకాశరాజు నేనే గెలుపు ఓటముల శాసనకర్త పకృతి ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ సమాధుల కోసం లక్షలు గుమ్మరించే నవాబు నేనే పన్ను వసూళ్ళ కోసం రజాకార్లను నియమించే గరీబు నేనే రాజులు మారినా ఏలుబడి తీరు మాత్రం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ మల్లెలంటే పడిచస్తానన్న పడతి నేనే మొక్కలకి నీళ్ళు పోయని ఇంతి నేనే మక్కువంటే ప్రాణం పోయడం/ఇవ్వడం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ.....12.02.2014. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది నేనే ఆత్మరక్షణ కోసమని పెప్పర్ స్ప్రే వాడిందీ నేనే భగత్ సింగ్ మాత్రం ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ...14.02.2013. విడిపోయో సమైక్యంగానో కలిసుందామన్నది నేనే ఉద్యమాల పేరుతో విషబీజాలు నాటుతున్నదీ నేనే బూతుమాటతో దెబ్బతిన్న మనోభావాలు మాత్రం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ...15.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlxnFM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి