పేజీలు

13, ఫిబ్రవరి 2014, గురువారం

Lingareddy Kasula కవిత

సీమాంద్ర పెట్టుబడిదారుల దౌర్జన్యం ,దురహంకారం ప్రజాస్వామ్య వ్యవస్థను వెక్కిరించింది. తెలంగాణను సాధించుకోవడానికి ప్రత్యన్మ్యాయ పద్దతులు వెతుక్కోమన్నది . ఆ సందర్భంగా ... నేనేమన్న?||డా// కాసుల లింగా రెడ్డి ||13-02-2014 నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? ఆకిలి పొక్కిలైందన్న సాన్పి చల్లి ముగ్గు పెట్టి తీరొక్క పువ్వులతోటి పేర్చిన బతుకమ్మసొంటి ఆకిలి పొక్కిలైందన్న పుట్టమన్ను తెచ్చి పుదిచ్చిన బొడ్డమ్మసొంటి అరుగు అరుమంద్రమైందన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? కండ్లనిండ చూసి తుర్తిపడాల్సిన పాలపిట్టను గుళ్ళేరు పెట్టి కొట్టొద్దన్న జెండాగా ఎత్తిపెట్టాల్సిన జొన్నకర్రలను మర్లవడ్డ దుడ్డోలె సెంద్రం సెద్రం చెయ్యొద్దన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? యాభై ఏండ్లసంది నీళ్ళు లేక, నిలువల్లేక కొలువుల్లేక, బతుకుదెరువుల్లేక తెర్లు తెర్లయిన బిడ్డల్ని తెగించి కొట్లాడమన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? రాయపాటి రాదార్ల దోపిడీకి జ(ల)గడపాటి బొమ్మరిండ్ల బేరానికి కావూరి కా(ఆ)సుపత్రుల దందాకు సుబ్బిరాముడి తోలుబొమ్మలాటలకు రామోజీ రంకు సిటీకి నా నేలే వేదికెందుకైందన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? దుష్ట కౌగిళ్ళు విడిపించుకోను కడుపుల్ని మాడ్చుకోమన్న తలరాతల్ని మార్చుకోను రాదారుల్ని మూసేయమన్న అమాస చీకట్ల తొలగించుకోను బొగ్గుబాయిలు బందుపెట్టమన్న దోపిడి కలుపు తీయ దోరదోర పిల్లల ఇస్కూళ్ళు క్లోజన్న సకల జనులు కూడి సమ్మె సైరనూదమన్న- తెలంగాణ తెచ్చుకోమన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? సమ్మక్క, సారలమ్మల శూరత్వం రాణి రుద్రమ రణన్నినాదం కొమరం భీం ధర్మాగ్రహం బందగీ తెగింపుల తేటదనం పాలుసాలని నా బిడ్డలకు సాలుపోస్తున్న సరిగ్గా అరవై ఏండ్ల కింద అలిసిన నా బిడ్డలు దాచిన జమ్మిచెట్టు మీది ఆయుధాలు తీయమన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? రచనాకాలం: 28 సెప్టెంబర్‌ 2011 5 అక్టోబర్‌ 2011 నమస్తే తెలంగాణ దినపత్రిక 'చెలిమె'.

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j93WXz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి