పేజీలు

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || నీతో కలిసి ఎగిరిపోవాలనుంటుంది. || నీవు పక్కన ఉన్నప్పుడు ఎందుకో తెలియదు ఒక లక్ష్యం, ఆలోచన లేని దురుసు యౌవ్వనాన్నై ఉండాలనుంటుంది. రాత్రిళ్ళు స్పీడుగా డ్రైవ్ చెయ్యాలనుంటుంది. గచ్చిబౌలీ, మాదాపూర్, కావూరీహిల్స్, పంజాగుట్ట, ప్రకాష్ నగర్ .... ఫ్లై ఓవర్ల మీదుగా ఎగిరి, కారు కిటికీలు క్రిందకు దించి, మ్యూసిక్ వాల్యూం పెంచి, నీతో బుద్ద పౌర్ణిమా, నెక్లెస్ రోడ్లమీద గడపాలనుంటుంది. టాంక్ బండ్ వైపు వెళ్ళి అక్కడ, ఆ బుద్దుడ్ని చూస్తూ .... కొబ్బరి బొండాలు కొట్టించుకుని తాగుతూ .... తెల్లవార్లూ అలా, విలాస, విహార యాత్రలకని తిరిగి, ఆక్కడి వసతి గృహాల్లో అనియంత్రితం గా కాలం గడిపేయాలనుంటుంది. వస్తు ప్రదర్శన శాలల్లో .... నాకు ఇష్టం లేని నీకెంతో ఇష్టమైన వస్తువుల్ని గుర్తించి అవి కొంటున్నప్పుడు ఆ ఆనందం, ఆ ఆశ్చర్యం .... ఆ అద్భుతమైన మెరుపు నీ ముఖం లో, నీ కళ్ళలో ప్రతిబింబిస్తున్నప్పుడు .... ఆ మెరుపు కాంతుల్ని, నీ జీవితం తో ముడివేసుకునున్న నా జీవితం అదృష్టాన్నీ ఆస్వాదించాలని ఉంటుంది. నిన్నూ, పిల్లల్నీ తెల్లవారుజాము రెండు గంటలకే నిద్ర లేపి, మీరు తయారయ్యేలోపు క్యారియర లో అన్నీసర్దుకుని, కారు నడిపి, మీరందరూ కారు లో నిద్ర పోతే, నాలుగున్నర గంటల అవిరామ జర్నీ పిదప మిమ్మల్ని నిద్ర లేపి మిమ్మల్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచుతూ, నాగార్జున సాగర వద్ద .... మీతో కలిసి సూర్యోదయం వేళ ను చూసి ఆనందించాలని, ఎత్తిపోతల వద్ద .... పిల్లల ఆనందం కేరింతల్ని చూసి పిదప అందరికీ ఇష్టమైన చేపల కూర కలిసి తినాలని ఉంటుంది. ఎప్పటికప్పుడు నీవు ఆశ్చర్యపోయేట్లు ఏదో ఒకటి చెయ్యాలని .... నీకూ, పిల్లలకూ జీవితం మీద ఉత్సాహం, ఆసక్తిని పెంచాలనుంటుంది. ఈ ఆలోచన ఖర్చుతో కూడుకున్నదే అయినా, అందులో ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమీ లేకపోయినా .... మన బంధం, మన అన్యోన్యత పరిపక్వమయినదే అయినా ఎందుకో డబ్బు మీద మమకారాన్ని పెంచుకోవాలనుండదు. మనుష్యులు మమతల స్థానం వస్తుతుల్యం చెయ్యాలనుండదు. 03 FEB 2014, MON 0100 PM

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k2NrPT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి